రామ్‌చరణ్ శుభవార్త చెబుతాడా?
on Mar 24, 2015
.jpg)
చిరంజీవి 150వ సినిమా గురించి అభిమానులు ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా వాళ్లని వెయిటింగ్‌లో పెట్టేసింది మెగా బృందం. గతేడాది ఆగస్టు 21 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు సినిమాపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పుకొన్నారు. ఆ వార్త వినే అవకాశం అప్పుడు దక్కలేదు. ఈలోగా రామ్‌చరణ్ పుట్టిన రోజూ వచ్చేస్తోంది. ఈనెల 27న చరణ్ బర్త్ డే. ఆ రోజైనా చిరు 150వ సినిమా గురించి శుభవార్త విరొచ్చని అభిమానులు గంపెడాశలు పెట్టుకొన్నారు. ఈ సినిమాకి నిర్మాత రామ్‌చరణే కాబట్టి... తన పుట్టిన రోజు కానుకగా చిరు సినిమా గురించి ఏమైనా చెబుతాడేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిరంజీవి ఇల్లు సందడి సందడిగా ఉంది. దర్శకులు, రచయితలూ చిరు ఇంటికివెళ్లి కలసి వస్తున్నారు. వాతావరణం చూస్తుంటే... 150వ సినిమాకి సంబంధించి ఏదో న్యూస్ బయటకు వచ్చేలానే ఉంది. ఆ ముహూర్తం ఈనెల 27నే ఫిక్సయితే... చరణ్ పుట్టిన రోజుకి అభిమానులు ఆశించే కానుక అంతకంటే ఏం ఉంటుంది?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



