నయన డబ్బు కోసం ఏమైనా చేస్తుందా?
on Mar 24, 2015
.jpg)
దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయికల్లో నయనతార పేరు కూడా ఉంటుంది. కోటి రూపాయలు తీసుకొన్న తొలి కథానాయికగా నయన ఖ్యాతి గాంచింది. ఆ తరవాత కోటి అనే పదం మామాలైపోయింది. నయన కెరీర్ మహా అయితే ఇంకో రెండేళ్లు ఉంటుందేమో..?? ఈలోగా చేతికందినంత సంపాదించుకోవాలని నయన పెద్ద స్కెచ్చే వేసింది. అందుకే ఇప్పుడు బంపర్ ఆఫర్ పెట్టిందట. `ఎలాంటి కథతో అయినా రండి.. కానీ అడిగినంత పారితోషికం ఇవ్వండి`అంటూ నిర్మాతలకు సంకేతాలు పంపిందట. దాంతో నయన ఇంటి ముందు క్యూ ఎక్కువైంది. ఆమె కోసం కథలు చెప్పడానికి దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే రెమ్యునరేషన్ విని... భయంతో పరుగులు పెడుతున్నారు. సినిమా రేంజుని బట్టి పారితోషికం ఫిక్స్ చేస్తోందట నయనతార. ఈమధ్య ఓ దర్శకుడు దర్టీ పిక్చర్ లాంటి కథ వినిపించాడట. అందులో బోల్డ్ సీన్లు బోల్డున్నాయట. ఈ సినిమా నటించడానికి నయన ఒప్పుకొంది గానీ... రూ.2.5 కోట్లు పారితోషికం అడిగిందట. దాంతో నిర్మాత ఖంగుతిన్నాడు. నయన ఎలాంటి కథనైనా ఒప్పుకొంటుదని, అయితే పారితోషికమే ముఖ్యమని తేలిపోయింది. డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు గానీ.. అన్నీ చేయాలనుకోవడం పొరపాటు. ఇప్పటి వరకూ నయన పెంచుకొన్న ఇమేజ్ తెచ్చుకొన్న పేరు... గంగపాలు అవ్వడం ఖాయం. మరి ఈ నిజం నయన ఎప్పుడు తెలుసుకొంటుందో.??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



