తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విజేత శ్రీకాంత్ రెడ్డికి పదివేలు బహుమతి
on Mar 23, 2015
.jpg)
తెలుగువన్ గత కొంతకాలంగా అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'PK-2' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన శ్రీకాంత్ రెడ్డి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి కి తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠ౦నేని రవిశంకర్ గారు పదివేల రూపాయల చెక్‌ని ఇచ్చి ప్రోత్సహించారు. షార్ట్ ఫిల్మ్ రూపకర్తలకు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



