టాలీవుడ్ కి అసలు శత్రువు రాజమౌళినే!
on Aug 4, 2022

ఎస్.ఎస్.రాజమౌళి పేరు వినగానే తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు అని గుర్తు చేసుకుంటాం. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం టాలీవుడ్ కి అతి పెద్ద శత్రువు రాజమౌళి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవుతున్నాయి. టికెట్ ధరలు, ఓటీటీల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావట్లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే సినిమా తీయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అందరూ అనుకున్నట్లు టాలీవుడ్ ప్రస్తుత స్థితికి థియేటర్లు, ఓటీటీలు కారణం కాదని.. టాలీవుడ్ కి అసలు శత్రువులు యూట్యూబ్, రాజమౌళి అని ఆర్జీవీ అంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ ఇప్పుడు జనాలు షార్ట్ వీడియోలకు అలవాటు పడ్డారని, ఉదయం లేవగానే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారని అన్నారు. అందులో అన్ని వయస్సులు, వర్గాల వారిని ఆకట్టుకునే కంటెంట్ ఉంటుందని.. అలా యూట్యూబ్ కి అలవాటు పడటం వల్లే థియేటర్స్ కి రాలేకపోతున్నారని అభిప్రాయపడనున్నారు. వాళ్ళు రెండు గంటలకు పైగా సమయం కేటాయించి థియేటర్స్ కి రావాలంటే.. రాజమౌళిలా 'ఆర్ఆర్ఆర్' లేదా 'కేజీఎఫ్' లాంటి సినిమాలు మాత్రమే తీయాలని అన్నారు. అందుకే తన దృష్టిలో పరిశ్రమకి అసలు శత్రువు యూట్యూబ్, రాజమౌళి అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



