బాలీవుడ్ కి రామ్ చరణ్
on Feb 13, 2012
బాలీవుడ్ కి రామ్ చరణ్ వెళ్ళనున్నాడు. వివరాల్లోకి వెళితే 1973 లో వచ్చిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రం "జంజీర్"ని హిందీలో రీమేక్ చేయనున్నారు. అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కి తొలి హిందీ చిత్రమవుతుంది. ఈ "జంజీర్" చిత్రం ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి తోలిసారిగా యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ ని ఇచ్చింది.
ఈ "జంజీర్" చిత్రాన్నే తెలుగు నటరత్న యన్ టి ఆర్ హీరోగా "నిప్పులాంటి మనిషి" అన్న పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని "స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం" అనే పాట ఈనాటికీ ప్రేక్షకుల నీరాజనాలందుకుంటుంది. అన్నట్టు రామ్ చరణ్ "జంజీర్" చిత్రం ఏప్రెల్ నుంచి సెట్స్ మీదకు రానుందట.