చరణ్ కి చెవుడు.. సమంత మూగ... సరిపోయింది
on Apr 11, 2017

రామ్ చరణ్ ఇప్పటి వరకు స్టైలిష్ రోల్సే చేసాడు. మొదటి సారి సుకుమార్ సినిమా కోసం పల్లెటూరి కుర్రాడి పాత్ర పోషిస్తున్నాడు. సినిమా సాంతం లుంగీ లోనే కనిపించనున్నాడు, పాటలతో సహా. అంతేనా, చరణ్ కి ఈ సినిమాలో చెవుడు సమస్య. ఇది నాణెం కి ఒక వైపే. చరణ్ కి జతగా నటిస్తున్న సమంత కూడా ట్రెడిషనల్ లుక్ లో అలరించనుంది. అన్నింటిని మించిన విశేషం ఏంటంటే, సమంత ఈ సినిమాలో మాట్లాడలేదు... అంటే మూగ. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది. ఒకరికొకరు ఎలా సంభాషించుకుంటారు.
మనకు వినడానికే వింతగా ఉంటే, ఈ స్క్రిప్ట్ తీర్చి దిద్దడంలో సుకుమార్ ఇంకెంత కష్టపడి ఉంటాడో. పాత సినిమాల్లో లాగ ఇదేం సీరియస్ మూవీ కాదు. ఇంకా చెప్పాలి అంటే, చరణ్, సమంతల మధ్య నడిచే సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు కురిపిస్తాయట. ఇంతకు ముందు చరణ్ కానీ, సమంత కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేదు కాబట్టి ఆడియన్స్ కి కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవబోతుంది అనడంలో సందేహం ఏమాత్రం అక్కర్లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



