నాగార్జునతో ఆ విషయంలో జాగ్రత్త !
on Jun 19, 2017

ఎదుటివారి మనసు తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలోనూ ఉటుంది. తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారు ? వారి మనసులో కదిలే ఆలోచనలు ఏమిటి ? ఈ క్షణం వారి మనసులో మెదిలే భావాలు.. ఇలా తెలిసిపోతే బావుటుంది కదా అనుకుంటాం. కాని ఇది ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి యంత్రాలు కూడా రాలేదిప్పటివరకూ. అయితే నాగార్జునకు మాత్రం ఇప్పుడు మనసు తెలిసిపోతుంది. ఎదుటివారి మనసులో ఏముందో పూసగుచ్చినట్లు చెప్పేస్తున్నారట నాగర్జున. ఇదంతా ‘రాజుగారి గది 2’ లోనే.
నాగార్జున హీరోగా ‘రాజుగారి గది 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, సీరత్ కపూర్ హీరోయిన్స్. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి తెలిసింది. ఎదుటివారి మనసును చదివేసే శక్తి ఆయనికి ఉటుందట. మనసులో ఏం మాట్లాడుకున్నా ఇట్టే పసిగట్టేస్తారట నాగ్. నాగార్జున నటిస్తున్న తొలి హారర్ కామెడి సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. ‘రాజుగారి గది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ లో ఓ మలయాళం సినిమా రిమేక్ రైట్స్ ను కొనుక్కుని దానికి చాలా మార్పులు చేసి ‘రాజుగారి గది 2’ని రూపుందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



