జోరుమీదున్న నటసింహం
on Jun 20, 2017

నటనకే సింహం లా అడుగులు వేస్తూ తన విశ్వరూపాన్ని చూపిస్తూ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర భారీ విజయం తో దూకుడుమీదున్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. తన వరుస చిత్రాలతో సందడి చేయడానికి సిద్దమైయ్యాడు.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో 'పైసా వసూల్ 'చిత్రం తో ఈ దసరా పండగకు అభిమానాన్ని హై రేంజ్ లో వసూల్ చేసుకునేందుకు రాబోతున్నాడు.ఈచిత్రం తో పాటు ప్రముఖ దర్శకులు కె.ఎస్ రవికుమార్ తెరకెక్కించనున్న కొత్త చిత్రం తో వచ్చే సంక్రాంతికి రాబోతున్నాడు.ఈ చిత్రానికి నటసింహం ,రెడ్డి గారు ..అనే టైటిళ్లను పరిశిలీస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ రెండు చిత్రాలకు పోటీగా ఈ దసరాకు మహేష్ బాబు హీరో గా రానున్న 'స్పైడర్ ' చిత్రం రానున్నది.సంక్రాంతి పండగకి మెగా హీరో రామ్ చరణ్ తన' రంగస్థలం 1985 'తో రానున్నాడు..అంతే కాకుండా మహేష్ బాబు తన మరో కొత్త చిత్రం'భారత్ అను నేను 'అనే చిత్రం తో రాబోతున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా బాలకృష్ణ యువ హీరోలతో తానేమి తీసిపోలేనని మరో మారు తన సత్తాను చాటేందుకు వచ్చేస్తున్నాడు.ఈ రసవత్తర ఆవిష్కరణలకై బాలకృష్ణ తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.ఆయన చేస్తున్న ఈచిత్రాలు అభిమానులలో భారీ అంచనాలు తెచ్చిపెట్టాయి.వైవిధ్యమైన కథలతో ఈ చిత్రాలు అలరించబోతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



