ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఆక్టర్
on Jun 19, 2017

సినిమాలు, సినిమా వాళ్ళు సాధారణ జనాలకి స్ఫూర్తి నిలిపేలా మెలగాలి కానీ... తప్పుదోవపట్టించేలా ఉండకూడదు... నిరాశ నిస్పృహలతో ఉన్న ఒక వ్యక్తి కి చైతన్యం కలిగించేలా నిలవాలి కానీ... తామే తప్పు చేసి తప్పుడు సందేశం ఇవ్వకూడదు... అసలు విషయానికి వస్తే, కన్నడ నటుడు హుచ్చ వెంకట్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఆదివారం వెంకట్ తన గెస్ట్ హౌస్ లో ఫినాయిల్ తాగి పడిపోయాడని... అతని సిబ్బంది సమయానికి అక్కడ ఉండడంతో వెంటనే అతన్ని రక్షించారని చెబుతున్నారు.
ఇంతకీ వెంకట్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటో తెలుసా? ప్రేమ విఫలం అని శాండల్ వుడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ సినీ వర్గాల కథనం ప్రకారం, వెంకట్ టెలివిజన్ రియాలిటీ షో సూపర్ జోడి లో కంటెస్టెంట్ గా చేస్తున్న రచన అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడట. ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో వెంకట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే, రచన మాత్రం తాను వెంకట్ ని ఎప్పుడూ ప్రేమించలేదని చెబుతుంది. ఇంతకు ముందు కూడా, వెంకట్ కి చాలా వివాదాలతో సంబంధాలు ఉన్నాయి. కన్నడ టాప్ హీరోయిన్ రమ్య ని పెళ్లిచేసుకున్నానని ప్రకటించి అందరి చేత తిట్లు తిన్నాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసి మళ్ళీ వార్తల్లో కెక్కాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



