అవన్నీ రూమర్లు .. రజనీ ఆరోగ్యంగా వున్నారు
on Jul 17, 2014
లింగా షూటింగ్ లో పాల్గొంటున్న సూపర్‌స్టార్ అస్వస్థతకు లోనయ్యారంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని లింగా సినిమా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెలిపారు. ప్రముఖ దినపత్రికలో రజనీకాంత్ ఆరోగ్యం బాలేదంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రజనీకాంత్ ఆరోగ్యం బాగుందని, లింగా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతోందని రవికుమార్ తెలియచేశారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న 'లింగా' చిత్రంలో రజనీకాంత్ పక్కన హీరోయిన్లుగా సోనాక్షి సిన్హా, అనుష్క నటిస్తున్నారు. నిర్మాత- రాక్‌లైన్ వెంకటేష్.