జైలర్ చూపిస్తున్న జెట్ స్పీడ్ కు సూపర్ స్టార్ ఫిదా!
on Jan 12, 2023

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా సినిమా షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నారు. ఇంతకుముందు ఆదర్శకుడితో విజయ్ బీస్ట్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నారు. అయినప్పటికీ రజినీకాంత్ ఇప్పుడు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రజినీ నెల్సన్ పనితనాన్ని చూసి ఫిదా అయినట్టు తెలుస్తోంది. అతను పక్కా ప్రణాళికతో పని చేస్తూ సినిమాను పూర్తి చేస్తున్న విధానాన్ని చూసి రజిని ఇటీవల అందరి ముందు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాని ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. వేసవి సెలవులు అయితేనే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా అవుతుందని భావిస్తున్నారు. ఆ సమయానికి సినిమా మొత్తం రెడీ అయ్యే విధంగా ముందుకు కొనసాగుతున్నారు. విడుదలకు నెలరోజుల ముందుగానే ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఫస్ట్ కాపీ తేవాలని, వీలైనంతవరకు ప్రమోషన్స్ కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకోవాలని ప్లానింగ్ చేశారు. మరో 30 రోజుల్లో షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తారట. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో 20 రోజుల సమయం పడుతుంది.
అంటే మొత్తానికి జైలర్ మూవీ ప్లానింగ్ ప్రకారమే పూర్తవుతుంది. సినిమా అయితే విడుదల కంటే నెల రోజుల ముందే పూర్తి సిద్ధంగా ఉంటుంది. రజినీకాంత్ మరో మంచి కథ కూడా ఉంటే చూడమని నెల్సన్ కి చెప్పారని, జైలర్ సినిమా వర్కౌట్ అయితే తప్పకుండా ఆ సినిమా చేద్దామని ముందుగానే అతనికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారట. మరి జైలర్ చిత్రం ఇటీవల పెద్దగా హిట్స్ లేని రజనీకిఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది? తన సహనటుడు కమల్ హాసన్ కి విక్రమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచినట్లు రజనీకి కూడా జైలర్ మరోసారి ఇండస్ట్రీ హిట్‌ని అందిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సి వుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



