తన ఆనందం సీక్రెట్ చెప్పేసిన భాగమతి!
on Jan 12, 2023

యంగ్ బాలీవుడ్ యాక్ట్రెస్ భూమి ఫడ్నేకర్ చాలా విషయాలను పంచుకున్నారు. తన ఆనందానికి రీజన్ ట్రావెలింగేనని వివరించారు. ఇండియన్ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పవర్‌ఫుల్ రోల్స్ చేస్తుంటారు భూమి ఫడ్నేకర్. ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసి, జనాల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు భూమి. మనసు బాగోలేదనిపిస్తే వెంటనే ఎటైనా వెళ్లిరమ్మని మన పెద్దలు సలహాలు ఇస్తుంటారని, కొత్త ప్రాంతాల్లో మనసు ప్రశాంతతను వెతుక్కుంటుందని, ఉత్సాహంతో ఉరకలు వేస్తుందని, స్వయానా ఎక్స్ పీరియన్స్ తో చెబుతున్నానని అన్నారు భూమి.
హెక్టిక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తర్వాత తాను తప్పకుండా కొత్త ప్రాంతాలను విజిట్ చేస్తానని చెప్పారు భూమి. అక్కడి సంస్కృతి, ట్రెడిషన్స్, ఫుడ్, అక్కడి చరిత్ర, జీవిన విధానం తెలుసుకోవడానికి ఇష్టపడతారట భూమి. ఇటీవల మెక్సికో వెళ్లారు యంగ్ బ్యూటీ. అక్కడ కొన్నాళ్లు స్పెండ్ చేశాక, మనసంతా ఫ్రెష్ గా అనిపించిందట. రానున్న రోజుల్లో ట్రావెలింగ్ గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారు భూమి.
తెలుగులో అనుష్క నటించిన భాగమతి సినిమాను హిందీలో చేశారు ఈ బ్యూటీ. దుర్గావతి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2023లో ఆరు సినిమాలు రిలీజ్‌కున్నాయి. కాబట్టి ఈ ఏడాది పెద్దగా ట్రావెలింగ్ చేయడానికి కుదరకపోవచ్చు. కానీ, ఈ సినిమాల ప్రమోషన్ల కోసం ఇండియాలో గట్టిగా తిరగాల్సి ఉంటుంది. అక్కడ లోకల్ ప్లేస్‌లను విజిట్ చేస్తా అంటున్నారు నార్త్ భామ. అనుభవ్ సిన్హ సినిమా, ది లేడీ కిల్లర్, అఫ్వా, భక్షక్, మేరే హస్‌బెండ్ కీ బీవీ లాంటి సినిమాలు రిలీజ్‌కున్నాయి భూమికి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



