ఆఖరికి ధోనీ కూడానా..
on Aug 18, 2016

రజనీకాంత్..ఈ పేరుకున్న ఫాలోయింగ్ అలాంటి ఇలాంటి కాదు. తన యాక్టింగ్‌తో పాటు ప్రవర్తనతోనూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు రజినీ. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. వారిలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఉన్నారు. కొందరు బహిరంగంగా తాము రజినీ అభిమానులమని ప్రకటిస్తే..మరికొందరు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతారు.
అలాంటి వారిలోకి చెందుతారు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. రీసెంట్‌గా వచ్చిన రజనీ మూవీ "కబాలి"లో సోఫాలో కూర్చున్న రజనీ పిక్ ఎంత పాపులరో అందరికి తెలిసిందే. ఆ స్టైల్‌ని చాలా మంది అనుకరించారు..ఇప్పటికీ అనుకరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరిపోయారు ధోనీ..కబాలి చిత్రంలో రజనీ సూట్ వేసుకుని స్టైల్‌గా కుర్చీలో కూర్చుని ఉన్న ఫోజును ధోనీ అనుకరిస్తూ ఫోటో దిగారు. అక్కడితో ఆగకుండా దానిని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ.."వన్ అండ్ ఓన్లీ తలైవా ఫోజును కాపీ కొట్టడానికి ట్రై చేశా"నంటూ రాశారు. సో ధోనీ కూడా తాను తలైవా ఫ్యాన్‌ని అని చెప్పకనే చెప్పాడన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



