సీక్రెట్‌గా ఇంటివాడైన జేడీ..
on Aug 19, 2016

హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తెలుగు వారికి సుపరిచితమైన జేడీ చక్రవర్తి ఎట్టకేలకు ఇంటివాడయ్యాడు. తన 46వ ఏట హీరోయిన్ అనుకృతితో ఏడడుగులు నడిచాడు. రామూ స్కూలు నుంచి వచ్చిన వీరిద్దరికి లవ్ ఎఫైర్ ఉందంటూ చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. వర్మ దర్శకత్వంలో "శ్రీదేవి" అనే సినిమాలో నటించింది అను. అయితే ఏమయ్యిందో ఏమో గానీ సినిమా రిలీజ్ కాకుండానే చాలా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి వీరి ప్రేమ ముదిరిపాకాన పాడి..పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అంతే సైలెంట్‌గా జేడీ చక్రవర్తి-అనుకృతిలు ఒక్కటైపోయారు. తమ పెళ్లిని పెద్దగా ఆర్భాటం లేకుండానే సన్నిహితుల మధ్య చేసేసుకున్నారు. విషయం తెలుసుకున్న జేడీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



