బన్నీపై మరీ ఇంత అభిమానమా..?
on Aug 18, 2016

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగు హీరోల్లో మరేవ్వరికి లేనంత ఫాలోయింగ్ మలయాళంలో ఉంది. తన డ్యాన్స్‌లు, ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో మలయాళీలకు బాగా దగ్గరైపోయాడు బన్నీ. అలా ఇలా కాదు అల్లు అర్జున్‌ని సరదాగా మల్లూ అర్జున్ అని పిలుస్తుంటారు అక్కడి యూత్. ఆ క్రేజ్‌కు తగ్గట్టే మళయాళ స్టార్ హీరోలతో సమానంగా..నిజం చెప్పాలంటే కాస్త ఎక్కువగానే మనోడి సినిమాలు అక్కడ బాగా ఆడటంతో పాటు కలెక్షన్లు కుమ్మేస్తాయి. ఆ అభిమానం మరీ పీక్ స్టేజ్‌కు వెళ్లిందో ఏమో బన్నీకి ఏసియానెట్ అనే మలయాళం ఛానెల్ వారు బిరుదు కూడా ఇచ్చేశారు. "ప్రవసి రత్న" అనే బిరుదును సదరు ఛానెల్ వారు త్వరలో బన్నీకి ప్రధానం చేయనున్నారు. కేరళలో అతని సినిమాలు ఆడుతున్నతీరు...ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌లను బేరీజు వేసుకునే అర్జున్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఏసియానెట్ ఛానెల్ తెలిపింది. సో ఇక మీదట బన్నీని మల్లూ అర్జున్ ప్లేసులో "ప్రవసి రత్న" అని పిలవాలేమో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



