అక్కినేని అఖిల్ బాబుకు ఏమిటి కష్టం!
on Jan 10, 2023

ఈమధ్య అక్కినేని ఫ్యామిలీ హీరోల అదృష్టం తిరగబడింది. వారి దురదృష్టం ఏమో గాని ఒక హిట్టు వచ్చిన వెంటనే ఒక రెండు మూడు ఫ్లాపులు వస్తున్నాయి. ఒక సక్సెస్ వెంటనే ఊహించని భారీ డిజాస్టర్ ఎదురవుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తీసిన అతిపెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్న ప్రతిసారి వారికి ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతూ, చేదు అనుభవాలు అనుభవం అవుతున్నాయి. అఖిల్ అయితే మొదటి నుంచి ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారు. అఖిల్ అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చినా రొమాంటిక్ ఇమేజ్ కాకుండా మాస్ యాక్షన్ ఇమేజ్ ని కోరుకుంటున్నారు. అదే విషయాన్ని ఆయన కెరీర్ మొదట్లోనే చూచాయగా తెలియజేశారు.
తనకు మాస్ అండ్ కమర్షియల్ హీరోగా, యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉందని తన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన నటించే చిత్రాలు ఏవి ఆ దిశగా ఆయనకు బ్రేక్ ని ఇవ్వలేకపోయాయి. మొదటి చిత్రం అఖిల్ ఇలాగే ఇబ్బందులు పడుతూ వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను నిరాశపరిచింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వాయిదాలు పడుతూ పడుతూ వచ్చి విడుదలయ్యింది. పరిస్థితి కూడా దీన్ని భిన్నం ఏమీ కాదు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు ఏవి కూడా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు.
అలాగని రొమాంటిక్ హీరోగా కూడా బాగా గుర్తింపు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రం ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం అతను ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా అఖిల్ బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందని ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు. అఖిల్ కూడా ఎంతో కష్టపడి ప్రాణాలు పెట్టి ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కాబట్టి యాక్షన్ ఎలిమెంట్స్ ఏమాత్రం తక్కువగా ఉండవు. అయితే ఈ సినిమాకు కూడా ఎన్నెన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ వాటిపై చిత్ర యూనిట్ పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది. కానీ అనేక రకాల కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తో మాత్రం కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే చాలాసార్లు అఖిల్ ఏజెంట్ కు సంబంధించిన బాడీ ఫిట్నెస్ ఫోటోలతో ఎంతో ఆకట్టుకున్నారు.
అప్పట్లో ఒక టీజర్ కూడా విడుదల చేసి అదే తరహాలో అట్రాక్ట్ చేశారు. సురేందర్ రెడ్డి అయితే ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆయన చివరగా చేసిన మెగాస్టార్ చిత్రం సైరా నరసింహారెడ్డి పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ తో అతను భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక రీసెంట్‌గా మరో బాడీ బిల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా ఎన్ని రోజులు ఫోటోలతో ఫ్యాన్సును సంతృప్తి పరుస్తారు అనేది అసలు ప్రశ్న. ఇవన్నీ వద్దు సినిమా అసలు అప్డేట్స్.... అలాగే ఎందుకు ఆలస్యం అవుతోంది... సినిమా సాంగ్స్ ఎక్కడ షూట్ చేశారు? రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎన్ని పాటలు ఉంటాయి? ఇలాంటి సందేహాలకు వారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఏజెంట్ ఈ వేసవిలో అయినా విడుదలవుతుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



