రాహుల్ రవీంద్రన్.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ
on Jun 14, 2021
`అందాల రాక్షసి` (2012)తో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆనక కథానాయకుడిగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. `చి ల సౌ`(2018)తో దర్శకుడి అవతారమెత్తాడు. సుశాంత్, రుహానీ శర్మ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా.. రాహుల్ కి డైరెక్టర్ గా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అయితే, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కించిన తన సెకండ్ డైరెక్టోరియల్ `మన్మథుడు 2` మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఫలితానికి తోడు విమర్శలు సైతం తోడయ్యాయి.
కాగా, స్వల్ప విరామం అనంతరం రాహుల్ మరోమారు మెగాఫోన్ పట్టనున్నారు. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఎ2 పిక్చర్స్ నిర్మాణంలో రాహుల్ థర్డ్ డైరెక్టోరియల్ తెరకెక్కనుందట. అంతేకాదు.. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మరి... `మన్మథుడు 2` డిజాస్టర్ అయిన నేపథ్యంలో.. రాబోయే చిత్రంతోనైనా రాహుల్ కెప్టెన్ గా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Also Read