బన్నీ రేసులో బాలీవుడ్ నటుడు
on Sep 12, 2013
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం "రేసు గుర్రం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరోహీరో నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో పొలిటీషియన్ శివారెడ్డి పాత్రలో బాలీవుడ్ నటుడు రవికిషన్ నటిస్తున్నట్లు సమాచారం. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.