`దిల్` రాజు.. జూలై డబుల్ ధమాకా!
on Jun 18, 2022

నిర్మాతగా స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజుది దాదాపు 20 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో సుమారు 50 చిత్రాలు నిర్మించారాయన. అయితే, ఇప్పటివరకు ఆయన నిర్మాణంలో ఒకే నెలలో రెండేసి సినిమాలతో పలకరించిన సందర్భాలు తక్కువే. కాగా, 2022 జూలైలో ఎన్నడూ లేని విధంగా రెండేసి చిత్రాలతో డబుల్ ధమాకా ఇవ్వనున్నారాయన.
ఆ వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ నాగచైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో రాజు నిర్మించిన తెలుగు చిత్రం `థాంక్ యూ`. వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూలై 8న జనం ముందుకు రానుంది. కట్ చేస్తే.. ఆ సినిమా రిలీజైన వారం తరువాత అంటే జూలై 15న రాజు నిర్మాణంలోనే తయారైన బాలీవుడ్ మూవీ `హిట్` రాబోతోంది. 2020 నాటి తెలుగు చిత్రం `హిట్`కి రీమేక్ వెర్షన్ గా రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రా కాంబినేషన్ లో శైలేష్ కొలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మరి.. వరుస వారాల్లో రాబోతున్న ఈ రెండు విభిన్న భాషా చిత్రాలతో `దిల్` రాజు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



