మరోసారి.. `RX 100` కాంబో!
on Dec 22, 2021

`RX 100`.. మూడేళ్ళ క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన చిత్రం. యంగ్ హీరో కార్తికేయ, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని ఓవర్ నైట్ స్టార్స్ చేసిన ఈ సినిమాతోనే అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటు కార్తికేయ, అటు పాయల్ దాదాపు అరడజను చిత్రాల్లో సందడి చేయగా.. అజయ్ భూపతి మాత్రం రీసెంట్ గానే తన సెకండ్ డైరెక్టోరియల్ `మహా సముద్రం`తో పలకరించాడు. అయితే, ఈ ముగ్గురు కూడా `RX 100` స్థాయి విజయాన్ని మళ్ళీ చూడలేకపోయారు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కార్తికేయ, పాయల్, అజయ్ భూపతి మరోసారి కలిసి పనిచేయబోతున్నారట. అంతేకాదు.. ఇదో బైలింగ్వల్ మూవీ అని సమాచారం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుందని.. ప్రముఖ నిర్మాణ సంస్థ జెమిని ఫిల్మ్ సర్క్యూట్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాక్. ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలన్న కసితో అజయ్ ఓ కొత్త తరహా కథాంశం సిద్ధం చేశారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే `RX 100` కాంబో సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది. మరి.. `RX 100` లాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



