నాగ్ జోడీగా `లెజెండ్` బ్యూటీ!
on Dec 22, 2021

కింగ్ నాగార్జున చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. తెలుగులో `బంగార్రాజు`, `ద ఘోస్ట్` చిత్రాలు చేస్తున్న నాగ్.. హిందీలో `బ్రహ్మాస్త్ర` ట్రయాలజీ చేస్తున్నారు. వీటిలో `బంగార్రాజు` సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా.. `బ్రహ్మాస్త్ర` ఫస్ట్ పార్ట్ `శివ` సెప్టెంబర్ 9న రిలీజ్ కి రెడీ అయింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ నడుమ `ద ఘోస్ట్` ఎంటర్టైన్ చేయనుంది.
`గరుడ వేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న `ద ఘోస్ట్` ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇందులో మాజీ `రా` ఏజెంట్ గా కనిపించనున్నారు నాగ్. అతనికి జోడీగా కాజల్ ఎంపికైంది. కొద్ది రోజులు చిత్రీకరణలో పాల్గొన్నప్పటికీ.. ఇటీవల గర్భం దాల్చడంతో కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. కాజల్ స్థానంలో అమలా పాల్, మెహ్రీన్ వంటి నాయికల పేర్లు వినిపించాయి కూడా. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `లెజెండ్` బ్యూటీ సోనాల్ చౌహాన్ ఇప్పుడా వేషంలో దర్శనమివ్వనుందట. అదే గనుక నిజమైతే.. నాగ్, సోనాల్ జంటగా నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `ద ఘోస్ట్`లో సోనాల్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, సోనాల్ ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న `ఎఫ్ 3`లో స్పెషల్ రోల్ చేస్తోంది. 2022 ఏప్రిల్ 29న ఈ మల్టిస్టారర్ థియేటర్స్ లోకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



