అఫీషియల్.. 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
on Jan 31, 2022

మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' విడుదల కానుందని ఇటీవల మూవీ టీమ్ తెలిపింది. అయితే ఈ రెండు తేదీల్లో కాకుండా మరో కొత్త తేదీలో 'ఆర్ఆర్ఆర్' విడుదల కానున్నట్లు తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమాని జనవరి 7 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేశారు. అయితే కరోనా థర్డ్ వేవ్ దెబ్బతో ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. కరోనా పరిస్థితులను బట్టి మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న సినిమాని విడుదల చేస్తామని మేకర్స్ ఇటీవల తెలిపారు. అయితే తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించి ఆశ్చర్యపరిచారు మేకర్స్. 'ఆర్ఆర్ఆర్'ను మార్చి 25 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన ఓ పోస్టర్ విడుదల చేశారు.

డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా ఆలియా భట్, తారక్ కి జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



