అల్లూరిగా రామ్ చరణ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్!
on Mar 14, 2019

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఈ కథకు మూలం ఎక్కడిదో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమౌళి చెప్పారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే... ప్రజలకు తెలిసిన అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు కావని రాజమౌళి చెప్పారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి ప్రజలను నడిపించడానికి ముందు రెండేళ్లు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్లారు. ఎక్కడికి అనేది ఎవరికీ తెలీదు. అలాగే, కొమరం భీమ్ కూడా స్వాతంత్ర్య పోరాటంలో దిగక ముందు రెండేళ్లు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్లారు. ఆ రెండేళ్లు అల్లూరి, కొమరం భీమ్ ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు? ఒకవేళ వాళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాజనిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా తీస్తున్నామని రాజమౌళి స్పష్టం చేశారు. సినిమాలో అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారని కూడా చెప్పారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్నారని కూడా కన్ఫర్మ్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



