కార్పొరేట్ అడవిలో... 'ఎదురీత'
on Mar 14, 2019

అడవిలో ఉన్నపుడు సీత మరిది చెప్పిన మాట వినలేదు. లక్ష్మణరేఖ దాటింది. తరవాత ఏమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది రామాయణం! కార్పొరేట్ అడివిలా మారిన హైదరాబాద్ మహానగరంలో ఒకరు గీత దాటారు. తరవాత మనిషిని మనిషి వేటాడే ఈ ప్రపంచంలో కొందరి రాతలు ఎలా మారాయి? అనే కథతో ఓ తండ్రీ, ఓ కుమారుడు మధ్య అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా 'ఎదురీత'. నందమూరి కల్యాణ్ రామ్ ఈ రోజు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. 'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. టీజర్ చూస్తుంటే... రెగ్యులర్ సినిమా టైపులో లేదు. కొంచెం డిఫరెంట్ గా, స్ట్రాంగ్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తోంది. "కుమారుణ్ణి అమితంగా ప్రేమించే ఓ మధ్య తరగతి తండ్రి, ఒకానొక దశలో కుమారుణ్ణి మరచిపోతారు. తరవాత ఏం జరిగింది?" అనే కథతో సినిమా రూపొందుతోంది. ఇదొక ఎమోషనల్ ఫిలిం అని సినిమా యూనిట్ చెబుతోంది. త్వరలో పాటల్ని, సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



