నేనుగా సినిమాల్లోకి రాలేదు
on Mar 13, 2019
`సూపర్ ` సినిమా తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అనుష్క. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీ బిజీగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. `బాహుబలి` సినిమాతో ఆమెకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు లభించింది. అయితే భాగమతి సినిమా తర్వాత ఏ సినిమా చేయలేదు. కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ మేకోవర్ తో ప్రజంట్ `సైలెన్స్` అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఆమె ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆమె కెరీర్ గురించిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. `నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు`. `సూపర్` సినిమా హీరోయిన్ కోసం పూరిగారు సెర్చ్ చేస్తోన్న తరుణంలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఆయనకు చెప్పారు. ఓ రోజు పూరి గారి దగ్గరి నుండి కాల్ వచ్చింది. అలా హైదరాబాద్ వచ్చాను..కెమేరా ముందుకు వచ్చి 14 ఏళ్లు పూర్తవుతుంది. నాకు ఇంత మంచి లైఫ్ రావడానికి కారణమైన పూరిగారికీ, నాగార్జున గారికీ నా ధన్యవాదాలు. వారిద్దరూ కూడా నా ఫ్యామిలీ సభ్యులంటూ రాసుకొచ్చిందీ స్వీటి.
Also Read