ఈ తొడల ఫాంటసీ అప్పటినుంచే ఉంది..అష్షు కాళ్ళ దగ్గర ఆర్జీవీ
on Dec 7, 2022
కాంట్రావర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ సినిమా. మరి ఆయన మూవీ ప్రమోషన్స్ ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీ ప్రమోషన్ కూడా ఒక కాంట్రోవర్సి కింద లెక్కే. ఇక ఇప్పుడు వర్మ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ‘డేంజరస్’. లెస్బియన్ రొమాన్స్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. నైనా గంగూలీ, అప్సర రాణి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ ప్రమోషన్ ని వెరైటీగా ప్లాన్ చేశారు వర్మ. ఆయన్ని ఇంటర్వూస్ చేసి మస్త్ పాపులర్ ఐన వారిలో అషురెడ్డి, అరియానా గ్లోరీ.. ఇనాయ సుల్తానా ఇలా చాలామంది ఉన్నారు. అషూరెడ్డి హుక్కా తాగుతూ సోఫాలో కూర్చుంటే ఆమె కాళ్ళ దగ్గర ఆర్జీవీ కూర్చుని మూవీ ప్రొమోషన్స్ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ మొత్తం కిక్కెక్కిస్తోంది.. మే నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ చివరకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
"రాము ఈ తొడల ఫాంటసీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది నీకు అని అష్షు అడిగేసరికి పదహారేళ్ళ వయసు మూవీలో శ్రీదేవి ఏరు దాటేటప్పుడు పరికిణీ పైకి పెట్టుకుంటుంది కదా అప్పటినుంచి. ఈ షాట్ కోసమే నేను ఈ మూవీని 17 సార్లు చూసాను. అప్పట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ లేదు కదా " అని కొంటెగా జవాబిచ్చాడు ఆర్జీవీ. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ " నా జీవితం మొత్తంలో నీలాంటి వ్యక్తిని చూడలేదు. గతంలో చూసిన గుర్తు లేదు, మున్ముందు చూస్తానన్న నమ్మకం కూడా లేదు. ఇండియాలో నిజంగా స్వతంత్రం వచ్చింది ఒక ఆర్జీవీకి మాత్రమే..కెమెరా ఆయన పెట్టినట్టు ఎవరు పెట్టలేరు ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ లో పెడుతాడు" అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read