'విరూపాక్ష'.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం
on Dec 7, 2022

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 15వ చిత్రానికి 'విరూపాక్ష' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
'విరూపాక్ష' టైటిల్ గ్లింప్స్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. "అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం" అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో 'విరూపాక్ష' టైటిల్ రివీల్ అయింది. అదిరిపోయే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. 2023, ఏప్రిల్ 21న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



