యాంకర్ శ్యామలపై ఆర్జీవీ హాట్ కామెంట్స్!
on Feb 16, 2022

తన కళ్ళకి ఎవరైనా నచ్చితే 'నువ్వు అందంగా ఉన్నావు' అంటూ డైరెక్ట్ గా, పబ్లిక్ గా చెప్పగలడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఓ సినిమా వేడుకలో అదే పని చేశాడు. యాంకర్ శ్యామలను ఉద్దేశించి 'ఇంత అందం.. ఇన్నాళ్లు నా కళ్ళలో ఎందుకు పడలేదు' అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.
'పుష్ప' సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ యాక్టర్ ధనుంజయ్ హీరోగా నటించిన సినిమా 'బడవ రాస్కెల్'. శంకర్ గురు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో విడుదలై హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అదే టైటిల్ తో ఈనెల 18న విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఆర్జీవీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ఈవెంట్ హోస్ట్ చేసిన శ్యామల అందం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
'ఇంత అందంగా ఉన్న మీరు ఇంతకాలం నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు' అంటూ శ్యామలను తెగ పొగిడేశాడు ఆర్జీవీ. అలాగే అందరూ తనని తోపు, రౌడీ, గూండా అంటారని.. కానీ తాను రాస్కెల్ కూడా అని అన్నాడు. ఇక ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ ప్రీత జయరామన్ పీసీ శ్రీరామ్ బంధువు అని తెలియడంతో.. పీసీ శ్రీరామ్ తో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని ఆర్జీవీ గుర్తుచేసుకున్నాడు. తన మొదటి సినిమా 'శివ' స్టోరీ చెప్తుంటే.. పీసీ శ్రీరామ్ సగంలోనే నిద్రపోయారని తెలిపాడు. ధనుంజయ్ టాలెంటెడ్ యాక్టర్ అని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుతూ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఆర్జీవీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



