`గని` రన్ టైమ్!
on Feb 16, 2022

`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా `గని`. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ రోల్ లో కనిపించబోతున్నాడు వరుణ్. అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఎంటర్టైన్ చేయనుంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు, నదియా వంటి ప్రముఖ తారలు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 25న `గని`ని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 151 నిమిషాల (2 గంటల 31 నిమిషాలు) నిడివితో ఈ చిత్రం వినోదాలు పంచనుంది. మరి.. ఈ రన్ టైమ్ `గని`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, `గని`ని సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. యువ సంగీత సంచలనం తమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



