యంగ్ హీరో సంచలనం.. నాలుగు రోజుల్లోనే 'డీజే టిల్లు'కి లాభాలు!
on Feb 16, 2022
.webp)
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ లిస్ట్ లో 'డీజే టిల్లు' చేరేలా ఉంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్స్ రాబట్టి లాభాల బాట పట్టిన ఈ సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'డీజే టిల్లు'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. దాదాపు రూ.9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు.. రూ.9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బరిలోకి దిగింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.10.54 కోట్ల కలెక్షన్స్ రాబట్టి లాభాల బాట పట్టింది. దాదాపు విడుదలైన అన్ని ఏరియాల్లోనూ లాభాలను చూస్తోన్న ఈ మూవీ ఇప్పటికే రూ.1.04 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. దీంతో క్లీన్ హిట్ గా నిలిచింది.
నైజాం ఏరియాలో రూ.2.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు నాలుగు రోజుల్లోనే రూ.4.28 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్ లో రూ.0.65 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ రూ.1.60 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. సీడెడ్, ఆంధ్రాలో రూ.4.90 కోట్ల బిజినెస్ చేసిన డీజే టిల్లు ఇప్పటిదాకా రూ.4 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రెండు మూడు రోజుల్లో అక్కడ కూడా లాభాలు చూసే అవకాశముంది. మరో వారం పదిరోజుల పాటు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



