ఆది ప్రేమ పాటలు వాయిదా
on Apr 10, 2014
"లవ్లీ" తర్వాత ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ చిత్ర ఆడియోను ఈనెల 13న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ, ఒకరోజు వాయిదా వేసి 14న విడుదల చేస్తున్నారు. ఇటివలే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.