`పుష్ప - ద రూల్`లోనూ ఐటమ్ సాంగ్!
on Jan 10, 2022

గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన `పుష్ప - ద రైజ్` చిత్రం.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తో తన ఖాతాలో ఫస్ట్ పాన్ - ఇండియా హిట్ ని కూడా జమ చేసుకున్నారు బన్నీ. కట్ చేస్తే.. ఈ సంవత్సరం `పుష్ప` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` సినిమాతో పలకరించబోతున్నారు. ఫిబ్రవరిలో పట్టాలెక్కనున్న ఈ రెండో భాగం.. సంవత్సరాంతంలో తెరపైకి రానుంది. ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ సెకండ్ పార్ట్ కి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది.
Also Read: ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోనున్న 'పుష్ప' నిర్మాతలు!
ఇదిలా ఉంటే.. `పుష్ప - ద రైజ్` కోసం చెన్నై పొన్ను సమంత ఆడిపాడిన ``ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా`` గీతం ఎంత ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `పుష్ప - ద రైజ్` హైలైట్స్ లో ఒకటిగా ఈ ఐటమ్ నంబర్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే.. `పుష్ప - ద రూల్`లోనూ ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్ ని కథానుసారం జోడించనున్నారట సుక్కు. `పుష్ప - ద రైజ్`కి హిందీనాట దక్కిన అపూర్వ ఆదరణని దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి దక్షిణాది నాయికతో కాకుండా ఓ బాలీవుడ్ భామతో ఈ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఓ క్యాచీ ట్యూన్ ని రెడీ చేసే పనిలో ఉన్నట్లు బజ్. మరి.. ``ఊ అంటావా మామా``కి మించి ఈ ఐటమ్ నంబర్ ఉంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



