ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోనున్న 'పుష్ప' నిర్మాతలు!
on Jan 7, 2022

ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన పుష్ప మూవీ మూడు వారాలుగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఒక్క ఆంధ్ర, రాయలసీమ ఏరియాలు మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఆ సినిమా బయ్యర్లు లాభాలను రుచి చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ & క్రేజీ సినిమాలు వాయిదా పడటంతో సంక్రాంతి సెలవుల దాకా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండగా, నేటి నుంచి పుష్ప అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also read: విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను కట్టించబోతున్న ప్రభాస్!
కాగా, ఆంధ్ర, రాయలసీమ ఏరియాల్లో అత్యధిక ధరలకు ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. దీనికి కారణం, టికెట్ ధరలు భారీ స్థాయిలో తగ్గడం, ఆ ధరలకు థియేటర్లను ఆడించడం కష్టమనే ఉద్దేశంతో పలు థియేటర్లు మూతపడటం, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ కొన్ని థియేటర్లను ప్రభుత్వం సీజ్ చేయడం లాంటివి.
Also read: బోయపాటి కోసం బన్నీ ద్విపాత్రాభినయం?
దీంతో ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోతున్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలని పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పుష్ప రెండో భాగాన్ని వారికి తక్కువ ధరకే ఇవ్వాలని వారు అనుకుంటున్నారంట. ఫిబ్రవరిలో పుష్ప ది రూల్ సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్కులో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



