'ఎన్టీఆర్ 30'.. యువసుధ ఆర్ట్స్ ఆఫీస్ ప్రారంభం
on Dec 12, 2022

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఎన్టీఆర్ 30'తో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారుతున్నారు. పదిహేనేళ్లకు పైగా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన 'యువసుధ ఆర్ట్స్' బ్యానర్ ని స్థాపించి.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా యువసుధ ఆర్ట్స్ ఆఫీస్ ప్రారంభమైంది.
ఆదివారం నాడు హైదరాబాద్ లో యువసుధ ఆర్ట్స్ ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు. 'ఎన్టీఆర్ 30'తో పాటు యువసుధ ఆర్ట్స్ పై వరుస భారీ చిత్రాలను నిర్మించడానికి సుధాకర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడో మే నెలలో ప్రకటించిన 'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ ట్రిప్ వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చాక సంక్రాంతి సమయంలో ఈ మూవీ లాంచ్ ఉండనుందని సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



