'లైగర్' ట్రైలర్ చూసి ఫీలవుతున్న పూరి ఫ్యాన్స్!
on Jul 21, 2022

హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకునే దర్శకులు చాలా తక్కువగా ఉంటారు. అందులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన సినిమాల్లోని హీరోల యాటిట్యూడ్, వాళ్ళు చెప్పే డైలాగ్స్ యూత్ కి బాగా నచ్చుతాయి. పూరి డైలాగ్స్ లో అనవసర ప్రాసలు, సాగదీతలు ఉండవు. ఆయన మాటలు గన్ లో నుంచి వచ్చిన బుల్లెట్ లా బలంగా తాకుతాయి. రియల్ లైఫ్ కి దగ్గర ఉంటూ ఆలోచింపజేసేలా ఉండే ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా అంటేనే ముందుగా హీరోలు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కానీ తాజాగా విడుదలైన 'లైగర్' ట్రైలర్ మాత్రం పూరి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది.
'లైగర్' ట్రైలర్ లో పూరి మార్క్ హీరో యాటిట్యూడ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ పూరి మార్క్ డైలాగ్స్ మిస్ అయ్యాయి. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ లో హీరో విజయ్ దేవరకొండ గట్టిగా రెండంటే రెండే డైలాగ్స్ చెప్పాడు. అవి కూడా ఒకటి 'ఐ లవ్ యూ' కాగా, రెండోది 'ఐయామ్ ఏ ఫైటర్'. పైగా ఇందులో విజయ్ 'ఐ.. ఐ..' అంటూ డైలాగ్ చెప్పే స్టైల్ చూస్తుంటే నత్తి అని అర్థమవుతోంది. దీంతో సినిమాలో కూడా హీరోకి తక్కువ డైలాగ్స్ ఉంటాయా? పూరి మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్ హీరో విజయ్ నోటి వెంట వినలేమా? అని పూరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి ట్రైలర్ లో మిస్ అయిన తన మార్క్ డైలాగ్స్ ని సినిమాలో బుల్లెట్స్ లా పేల్చి పూరి లెక్క సరి చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



