'లైగర్' ట్రైలర్.. రమ్యకృష్ణ ఊర మాస్ డామినేషన్!
on Jul 21, 2022

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత విజయ్ పేరో, పూరి పేరో ఎక్కువగా వినిపించాలి. కానీ దానికి భిన్నంగా లేడీ టైగర్ రమ్యకృష్ణ పేరు మారుమోగిపోతోంది. 'లైగర్' ట్రైలర్ దెబ్బకి ప్రస్తుతం ట్విట్టర్ లో రమ్యకృష్ణ పేరు ట్రెండింగ్ లో ఉంది.
రమ్యకృష్ణ ఆహార్యం గురించి, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పర్లేదు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె తనదైన మార్క్ చూపించారు. పాత్రకు తగ్గట్లు ఆమె తనను తాను మార్చుకునే విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా తన గ్లామర్ తో ఆట్టుకోవడమే కాకుండా.. 'నరసింహ'లో 'నీలాంబరి', 'బాహుబలి'లో 'శివగామి' వంటి పాత్రలతో.. ఆ పాత్రలలో ఆమెని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేనంత గొప్పగా నటించారు రమ్యకృష్ణ. తాజాగా 'లైగర్' ట్రైలర్ లో కూడా ఊర మాస్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

'లైగర్'లో విజయ్ కి తల్లిగా కనిపిస్తున్నారు రమ్యకృష్ణ. "ఒక లయన్ కి, టైగర్ కి పుట్టుండాడు.. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ" అంటూ ఆమె చెప్పే డైలాగ్ తోనే ట్రైలర్ ప్రారంభమైంది. చీర కట్టులో మాస్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు ఆమె. విజయ్ ని కాలితో తన్నడం, 'కొట్టరా సాలే' అని అరవడం, 'ఏయ్' అని బెదిరించడం వంటిని రమ్యకృష్ణ ట్రైలర్ లో హైలైట్ అయ్యేలా చేశాయి. మొత్తానికి ట్రైలర్ లో తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు ఆమె. దీంతో 'లేడీ డాన్', 'లేడీ టైగర్' అని ప్రశంసిస్తూ ప్రస్తుతం ఆమె పేరుని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



