యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటిన 'డీజే టిల్లు'
on Feb 21, 2022

రీసెంట్ టైంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది 'డీజే టిల్లు'. విడుదలైన నాలుగురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాట పట్టిన ఈ సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోన్న ఈ సినిమా తాజాగా యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటడం విశేషం.

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'డీజే టిల్లు'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. రూ.8.95 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన డీజే టిల్లు.. రూ.9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బరిలోకి దిగింది. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.14.96 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా రూ.5.46 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. భీమ్లా నాయక్ విడుదల(ఫిబ్రవరి 25)కి మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో ఈలోపు మరో 2-3 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది.

ఓవర్సీస్ లోనూ 'డీజే టిల్లు' మంచి కలెక్షన్స్ రాబడుతోంది. డీజే టిల్లు యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటిందని తెలుపుతూ ఈ సినిమాని ఓవర్సీస్ లో రిలీజ్ చేసిన రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నిర్మాత నాగ వంశీకి, మూవీ టీమ్ కి రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ధన్యవాదాలు తెలిపింది. 'డీజే టిల్లు' ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



