స్టార్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ప్రొడ్యూసర్ ధర్నా!
on Sep 15, 2022

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఎన్నో అవార్డు విన్నింగ్ సినిమాలు వచ్చాయి. అందులో 2003లో విడుదలైన 'పితామగన్'(శివ పుత్రుడు) ఒకటి. ఈ చిత్రంతో దర్శకుడిగా బాలాకి ఎంతో పేరు వచ్చింది. విక్రమ్ ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోగా, సూర్య సైతం తన నటనతో కట్టిపడేశాడు. అయితే ఇంతటి గొప్ప సినిమాని అందించిన బాల పట్ల ఆ చిత్ర నిర్మాత వీఏ దురై మాత్రం కోపంగా ఉన్నాడు. తాజాగా బాల ఆఫీస్ ముందు ధర్నా కూడా చేశాడు.
'పితామగన్' సమయంలో మరో సినిమా చేస్తానని దురై దగ్గర బాల రూ.25 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ రోజులు, నెలలు, ఏళ్ళు గడిచినా ఆయనకు ఇంకో సినిమా చేసి పెట్టలేదట. పోనీ అడ్వాన్స్ అయినా తిరిగివ్వమని అడిగితే సరైన సమాధానం లేదట. కొంతకాలంగా ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న దురై.. తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ తాజాగా బాల ఆఫీస్ కి వెళ్లగా.. అక్కడ స్టాఫ్ ఆయనను బయటకు పంపించేశారట. దీంతో దురై తనకు న్యాయం చేయాలంటూ బాల ఆఫీస్ ముందు ధర్నాకు దిగాడు. ఈ క్రమంలో నిర్మాతల సంఘం కలుగజేసుకొని సమస్యను పరిష్కరిస్తామని మాట ఇవ్వడంతో ఆయన ధర్నా విరమించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



