రేపే బిగ్ బాస్ సన్నీ మూవీ రిలీజ్.. ప్రమోషన్స్ ఎక్కడ బాసూ?
on Sep 15, 2022

సినిమాలలో హీరో అవ్వాలనుకునే ఎందరో మొదట టీవీ యాంకర్ గానో, సీరియల్ యాక్టర్ గానో కెరీర్ ని ప్రారంభిస్తారు. అలాంటి వారికి ఈమధ్య బిగ్ బాస్ షో కూడా ఒక ఆప్షన్ గా కనిపిస్తుంది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వచ్చి ప్రేక్షకులకు దగ్గరై, సినిమాలలో అవకాశాలు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. బిగ్ బాస్-5 విన్నర్ వీజే సన్నీ కూడా ఆ కోవలోకే వస్తాడు.
పెద్దగా అంచనాల్లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపట్టిన సన్నీ.. తనదైన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకొని విజేతగా నిలిచాడు. యాంకర్ గా, సీరియల్ యాక్టర్ గా కంటే బిగ్ బాస్ తో తక్కువ టైంలోనే ఎన్నో రెట్ల ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా పలు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే హీరోగా నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ సినిమాలను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమవుతున్నాడు.
సన్నీ, అషిమా జంటగా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం 'సకల గుణాభి రామ'. ఈ సినిమా రేపు(సెప్టెంబర్ 16న) థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలవుతున్న విషయం ప్రేక్షకులకి తెలియడం సంగతేమో కానీ సినీ వర్గాల్లోనే చాలామందికి తెలియదు. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో.
ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు తమ సినిమాలను విభిన్న తరహాలో ప్రచారం చేసుకుంటూ.. తన సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో సన్నీ బాగా వెనకబడిపోయాడు. ఏదో ఫార్మాలిటీకి తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కలిసి ఓ ప్రెస్ మీట్ తప్ప 'సకల గుణాభి రామ' చిత్రం గురించి పెద్దగా ప్రచారం లేదు. సినిమాలలో అవకాశాలు తెచ్చుకోవడం, సినిమాలను విడుదల చేయడం గొప్ప కాదు. ఆ సినిమాలను ప్రేక్షకులలోకి తీసుకెళ్లగలగాలి. లేదంటే డబ్బు, శ్రమ రెండూ వృధా అవుతాయి. సన్నీ ఇప్పటికైనా మేల్కొని తన చిత్రాలను ప్రమోట్ చేసుకుంటే బెటర్. లేదంటే బిగ్ బాస్ ఫేమ్ తో వచ్చిన ఒకట్రెండు ఆఫర్లే తప్ప.. కొత్త అవకాశాలు తన తలుపు తట్టే అవకాశం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



