రాజాసాబ్ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?.. ప్రభాస్‌కిది మామూలేనా?
on Dec 3, 2025
- ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు
- సంక్రాంతి కానుకగా రాజా సాబ్
- ప్రభాస్ మొదటి హారర్ థ్రిల్లర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు డైరెక్టర్ మారుతి చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది.
సలార్, కల్కి వంటి భారీ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్.. ఈ ముగ్గురూ ప్రభాస్‌తో రొమాన్స్ చెయ్యబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజరుదత్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్ని రాజాసాబ్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని అర్థమవుతోంది.
షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈమధ్యకాలంలో ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఎక్కువ రన్‌టైమ్‌తోనే ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా ఆ వరసలో నిలవబోతోంది. ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు 'ది రాజా సాబ్' మూవీ రన్‌టైమ్ సుమారు 3 గంటలా 14 నిమిషాలుగా కనిపిస్తోంది. అంటే ప్రభాస్ గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా రన్‌టైమ్ ఉంది. మరి ఇది సినిమా రన్‌పై ప్రభావం చూపిస్తుందా? లేక ట్రిమ్ చేస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



