"చండీ" పాటలు విడుదల
on Aug 13, 2013
ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "చండీ". వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం శిల్పకళావేదికలో జరిగింది. బెల్లంకొండ సురేష్ ఆడియో సిడీలను ఆవిష్కరించి, తొలి సీడీని కృష్ణంరాజుకు అందజేసారు. బి.గోపాల్ ట్రైలర్ ను విడుదల చేసి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఎస్.ఆర్. శంకర్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.