నాగశౌర్య సప్త అవతారాలు!
on Jul 10, 2019

హీరోలు డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు. తరచూ ఎవరో ఒకరు చేస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ 'దశావతారం'లో పది క్యారెక్టర్లలో నటించి రికార్డు సృష్టించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఆ రికార్డు బ్రేక్ చేయడం లేదు గానీ... కమల్ హాసన్ రికార్డ్ దగ్గరలోకి వచ్చాడు. తనకు 'ఊహలు గుసగుసలాడే', 'జో అచ్యుతానంద' వంటి హిట్ సినిమాలు ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. అందులో అతడు ఏడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. కమల్ కంటే ఒక మూడు క్యారెక్టర్లు తక్కువ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. దీంతో పాటు 'అశ్వత్థామ' షూటింగ్ కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నాడు నాగశౌర్య. త్వరలో 'పార్థు' సినిమా ప్రారంభించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



