ప్రభుదేవా షూటింగ్ స్పాట్‌లో విషాదం
on Apr 1, 2017

ప్రముఖ నటుడు, డాన్సర్, డైరెక్టర్ ప్రభుదేవా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ స్పాట్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రభు, లక్ష్మీ మీనన్ జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ చంగ్ మూవీ షూటింగ్ గత 15 రోజులుగా తంజావూరు సమీపంలోని తిరువైయరులో జరుగుతోంది. దీనిలో భాగంగా నిన్న అయ్యరప్పర్ దేవాలయంలో షూటింగ్ జరిగింది..ఇవాళ తెల్లవారు జామున చిత్ర యూనిట్ కోసం భోజనాలు తెస్తున్న వ్యాన్ కబిస్థలం సమీపంలోని కరుప్పుర్ గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తో పాటు చిత్రయూనిట్‌కు చెందిన మరో వ్యక్తి దుర్మరణం పాలవ్వగా..మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమకు భోజనాలు తెచ్చేందుకు వెళ్లిన వారు మరణించడంతో చిత్ర యూనిట్ శోకసంద్రంలో మునిగిపోయింది. వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని వారు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



