కాటమరాయుడుకి ఎంత పోతుందో తెలుసా??
on Apr 3, 2017

భారీ అంచనాల మధ్య విడుదలైన కాటమరాయుడు బాక్సాఫీసు దగ్గర పల్టీ కొట్టిన సంగతి తెలిసిందే. తొలి రోజు కనిపించిన ఊపు.. రెండో రోజు మాయమైంది. రోజు రోజుకీ వసూళ్లు తగ్గుమొహం పట్టడంతో కాటమరాయుడికి భారీ నష్టాలు తప్పేట్టు లేవని ముందే ఓ అంచనాకు వచ్చేశారు ట్రేడ్ వర్గాల నిపుణులు. ఆ మాటే ఇప్పుడు నిజమైంది. కాటమరాయుడు పవన్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా దాదాపుగా రూ.35 కోట్ల నష్టాల్ని మిగిల్చింది.
విడుదలకు ముందే శాటిలైట్ తో కలిపి రూ.104 కోట్ల బిజినెస్ చేసిందీ చిత్రం. ఇప్పటికి రూ.60 కోట్లు కూడా రాలేదట. దాంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేట్టు లేదు. అన్ని ఏరియాల్లోకలపి రూ.35 కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని, నైజాం ఏరియా కాస్తలో కాస్త బెటర్ అని, ఓవర్సీస్ కొన్నవాళ్లంతా గగ్గోలు పెడుతున్నారని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఇలానే బయ్యర్లకు షాక్ ఇచ్చింది. పవన్ ఇప్పుడు కాటమరాయుడో రెండో షాక్ ఇచ్చాడన్నమాట. మరి ఈ నష్టాలనైనా పవన్ భర్తీ చేస్తాడా? లేదంటే మరో సినిమాలో చూద్దాం అంటూ కవర్ చేసుకొంటాడా??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



