వాసుకి సుంకవల్లిపై ప్రభాస్ మోజు
on Jul 19, 2011
వాసుకి సుంకవల్లిపై ప్రభాస్ మోజు పడుతున్నాడట. వివరాల్లోకి వెళితే మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా తరపున ఎంపికైన అచ్చ తెనుగమ్మాయి వాసుకి సుంకవల్లిని హీరోయిన్ గా తను హీరోగా నటించబోయే చిత్రంలో తీసుకోవాలని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడట. అపజయమెరుగని యువడైనమిక్ డైరెక్టర్ రాజమౌళిదర్శకత్వంలో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ తదితరులు నిర్మించబోతున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోనే ఉంగుటూరుకి చెందిన మన తెలుగమ్మాయి వాసుకి సుంకవల్లిని హీరోయిన్ గా నటింపజేయాలన్న ప్రయత్నాలు భారీగానే జరిగుతున్నాయట. గతంలో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, తాప్సి వంటి వారంతా ఇలా సినీ పరిశ్రమకు వచ్చిన వారే. వారంతా ఈ రోజున హిందీ, తెలుగు సినీ పరిశ్రమలను ఏలుతున్నారు. అలాగే వాసుకి సుంకవల్లి కుడా సినీ హీరోయిన్ గా రాణించగలదని ఆశిద్దాం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
