ENGLISH | TELUGU  

ఇలియానాతో వెంకటేష్ రొమాన్స్

on Jul 18, 2011

ఇలియానాతో వెంకటేష్ రొమాన్స్ చేయనున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్ త్వరలో నలక నడుము గోవా భామ ఇలియానాతో రొమాన్స్ చేయనున్నారట. అంటే విక్టరీ వెంకటేష్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, నాగార్జున హీరోగా "సంతోషం, ప్రభాస్ హీరోగా "మిస్టర్ పర్ ఫెక్ట్"వంటి సూపర్ హిట్ చిత్రాలనందించిన ప్రతిభావంతుడైన యువ దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతూందట.

విక్టరీ వెంకటేష్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించబోయే ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించనున్నారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో గ్రాఫిక్స్ కి అత్యథిక ప్రాథాన్యత ఉంటుందని సమాచారం. గతంలో హీరో వెంకటేష్ "సాహసవీరుడు-సాగరకన్య", "దేవీపుత్రుడు" వంటి సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించారు. మరి ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో వెంకటేష్ ని ఎలా చూపిస్తారో దర్శకులు దశరథ్  వేచి చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.