నాగచైతన్య దడ ఆడియో రిలీజ్ జూలై 25 కి వాయిదా
on Jul 19, 2011
నాగచైతన్య "దడ" ఆడియో రిలీజ్ జూలై 25 కి వాయిదా పడిందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దడ". నాగచైతన్య "దడ" ఆడియో రిలీజ్ నిజానికి జూలై 24 వ తేదీన జరగాల్సి ఉంది.
కానీ హైదరాబాద్ లో ప్రస్తుతం బోనాల పండుగ హడావుడి మూలంగా, ఈ చిత్రం ఆడియో రిలీజ్ ని జూలై 25 వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. ఈ నాగచైతన్య "దడ" చిత్రంలో నాగచైతన్య విదేశాల్లో చదువుకున్న భారతీయ విద్యార్థిగా నటిస్తున్నారు. ఆయనకు అన్నగా, శ్రీకాంత్ (తమిళ హీరో), వదినగా అక్ష నటిస్తున్నారు. ఈ నాగచైతన్య "దడ" చిత్రం బ్యాంకాక్ లో ఒక భారీ స్కెడ్యూల్ జరుపుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
