ప్రభాస్ సినిమా కోసం దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చారా?
on Jun 4, 2020

'కేజిఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు ఈరోజు (జూన్ 4). తెలుగులో రెండు అగ్ర నిర్మాణ సంస్థలు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ కాగా... మరొకటి డివివి ఎంటర్టైన్మెంట్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఇది వార్తల్లో నిలుస్తోంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మరి ప్రశాంత్ నీల్ కి డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది? పరిశ్రమ ప్రముఖులలో చిన్న క్వశ్చన్. సాధారణంగా నిర్మాణ సంస్థలు దర్శకులు ఎవరికీ ఊరికే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవు. అతడితో సినిమా తీసే ఉద్దేశం ఉన్నప్పుడు లేదంటే ఆ దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే శుభాకాంక్షలు చెబుతారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమా నిర్మించిన ఉన్నదనే విషయం ఈ రోజు ఖరారు అయ్యింది.
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా నిర్మించాలని డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేత డి.వి.వి. దానయ్య ప్లాన్ అని సమాచారం. ప్రభాస్ సినిమా కోసమే దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



