మహిళలను గౌరవించడం ఎలాగో ఎన్టీఆర్ కి తెలుసు
on Jun 4, 2020

మంచు మనోజ్ సరసన 'ప్రయాణం' చిత్రంలో కథానాయికగా నటించిన పాయల్ ఘోష్ గుర్తున్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన 'ఊసరవెల్లి' చిత్రంలో కథానాయిక స్నేహితురాలిగా కీలక పాత్రలో ఆమె నటించారు. ట్విట్టర్ లో బుధవారం రాత్రి '#askpayalghosh' కార్యక్రమం ఆమె నిర్వహించారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
''మీరు 'ఊసరవెల్లి' చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు. అతడితో షూటింగ్ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?'' అని పాయల్ ఘోష్ ను అడిగితే.... "మేం బ్యాంకాక్ లో షూటింగ్ చేస్తున్నాం. ఒక సాంగ్ తీస్తున్నారు. నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా టీం చిన్న టెంట్ అరేంజ్ చేశారు. నేను అందులోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. రోడ్డుమీద ఆ టెంట్ అరేంజ్ చేయడంతో ఎన్టీఆర్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఆయనకు మహిళలను గౌరవించడం ఎలాగో తెలుసు. మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారు" అని చెప్పారు. ఆకతాయిలు ఎవరో చేసిన పనికి ఎన్టీఆర్ ని నిలదీస్తున్న కొందరు పాయల్ ఘోష్ చెప్పిన మాటలు వింటే బావుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



