ఈ సిగ్గు నన్ను వదిలేలా లేదు!
on Dec 23, 2021

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. 'సాహో' సినిమా టైమ్ లో ఇండియా అంతా తిరిగానని, అయినా నా సిగ్గు మాత్రం తగ్గలేదని అన్నారు.
"ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. పెదనాన్న గారి పోస్టర్ చూశారుగా.. ఆయన చిన్న సైజు దేవుడిలా ఉన్నారు. రాధే శ్యామ్ లవ్ స్టోరీనే కానీ.. ట్రైలర్ చూశారుగా షిప్ లు గిప్ లు చాలా ఉంటాయి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా థాంక్స్. ఈ సినిమాలో జగపతి బాబు గారు గెస్ట్ రోల్ లో కనిపిస్తారు. చాలా మంచి క్యారెక్టర్ చేశారు. డైరెక్టర్ సినిమా కోసం 5 సంవత్సరాలు కూర్చోవడం అంటే జోక్ కాదు. కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. కానీ ఆయన చాలా బాగా తీశారు. సినిమాలో చాలా ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి. క్లైమాక్స్ హైలైట్ అవుతుంది అనుకుంటున్నా." అని ప్రభాస్ అన్నారు.
అలాగే ఈవెంట్ హోస్ట్ చేసిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి ప్రభాస్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇక తన సిగ్గు గురించి కూడా ప్రభాస్ సరదా వ్యాఖ్యలు చేశారు. "సాహో టైంలో ఇండియా అంతా తిరిగి, సిగ్గుపోయి బాగా మాట్లాడేస్తాను అనుకున్నాను. కానీ పోలేదండి. ఇది ఇక అంతేనేమో. ఈసారి ఎలాగైనా స్పీచ్ ఇరగదీసేద్దాం అనుకున్నాను. కానీ పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. ఎనీవే డార్లింగ్స్.. లవ్ యూ సో మచ్" అంటూ ప్రభాస్ తన స్పీచ్ ముగించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



